పాతబస్తీలో రూ.70 వేలు పలికిన పొట్టేల్

బక్రీద్​ పండుగ కోసం పొట్టేళ్లు, మేకపోతుల అమ్మకాలు జోరందు కున్నాయి. శనివారం ఒక్కో పొట్టేలు రూ.60 నుంచి రూ.70 వేల దాకా అమ్ముడుపోయింది. పాతబస్తీ ఏరియాల్లో గల్లీకో పశువుల సంత ఏర్పాటైంది. నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పండుగ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 దాకా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు చెప్పారు. మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు.

 

Latest Updates