సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను నాశనం చేసింది వాళ్లే

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను నాశనం చేసింది ఎవరో తనకు తెలుసంటూ  డైరెక్టర్ శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ ఆదివారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫర్లు లేకపోవడంతో ఒత్తిడికి గురై సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.

పానీ అనే సినిమాపై చర్చలు జరిగే సమయంలో డైరక్టర్ శేఖర్ కపూర్ కు  హీరో సుశాంత్ మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహంతోనే  సుశాంత్ తన భుజం పై తలపెట్టి ఎన్నిసార్లు ఏడ్చాడో అంటూ డైరక్టర్ ట్వీట్ చేశారు.

నువ్వు ఎంత బాధ అనుభవించావో నాకు తెలుసు. నిన్ను పతనం చేసిన వాళ్ల గురించి తెలుసు. నువ్వు వాళ్ల కారణంగా బాధ అనుభవిస్తూ నా భుజంపై తలపెట్టి ఏడ్చేవాడివి..నేను ఆరు నెలల కిందట చేరుకోవాల్సి ఉండింది. నువ్వు కలిసి ఉండాల్సింది. జరిగిందంతా వాళ్ల కర్మ, నీది కాదు..అని ఆయన ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ ను పతనానికి కారణమైన వారు ఎవరు అనేది శేకర్ కపూర్ చెప్పలేదు.

Latest Updates