ఐపీఎల్ కూ బాలీవుడ్ డ్రగ్స్ ఉచ్చు..బాత్రూం రూమ్ లో డ్రగ్స్ తీసుకున్న పలువరు ప్రముఖుల భార్యలు

బాలీవుడ్ డ్రగ్స్ కుంభకోణంలో హీరోయిన్లే కాదు. పలువురు స్టార్స్ భార్యలున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీతో డ్రగ్స్ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, అతని సోదరుడు జైలుశిక్షను అనుభవిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసు లో దీపికా పదుకుణే , రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా డ్రగ్స్ దందా వ్యవహారంలో పలువురు స్టార్స్ భార్యలున్నారని బాలీవుడ్  నటి షెర్లిన్ చోప్రా బాంబు పేల్చింది.

ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ న్యూస్ తో షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ ఐపీఎల్ టీం కోల్ కతా నైట్ రైడర్స్   టీమ్ మ్యాచ్ ముగిసిన తరువాత పార్టీ జరిగినట్లు చెప్పిన షెర్లిన్..ఆ పార్టీ సందర్భంగా తాను బాత్రూమ్ కి వెళ్లగా..బాత్రూం లో పలువురు స్టార్స్ భార్యలు కొకైన్ పీలూస్తు కనిపించారని అన్నది.

ఆ ఆధారాల్ని బయటపెడతారా అన్న మీడియా సంస్థ ప్రతినిధి ప్రశ్నలకు..షెర్లిన్ స్పందిస్తూ మీడియా ఎదుట వారిపేర్లు చెప్పబోనని. ఎన్సీబీ అధికారులు విచారిస్తే అందుకు సంబంధించిన ఆధారాల్ని బయటపెడతానని షెర్లిన్  చెప్పింది.

Latest Updates