నలిగిపోతున్నఅస్సాం రైఫిల్స్​

అస్సాం రైఫిల్స్​కి గొప్ప చరిత్ర ఉంది.  మన దేశానికి 185 ఏళ్లుగా సెక్యూరిటీ సేవలు అందిస్తోంది. 1835లో ఏర్పడిన ఈ పారామిలటరీ ఫోర్స్​ని సమాజానికి కుడి చెయ్యిలా, సైన్యానికి ఎడమ చెయ్యిలా చెప్పుకుంటారు. 1960ల్లో 17 బెటాలియన్లే ఉండగా, ఇప్పుడు 46,000 బెటాలియన్లు కలిగిన బలగంలా ఎదిగింది. ఇండిపెండెన్స్​ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఇండియా పైచేయి సాధించటంలో, నార్త్​ ఈస్ట్​లోని చొరబాట్ల కట్టడిలో కీలక పాత్ర పోషించింది. ఈ రైఫిల్స్​పై పట్టు కోసం హోం, డిఫెన్స్​ శాఖలు కొన్నేళ్లుగా పోటీ పడుతున్నాయి.

అస్సాం రైఫిల్స్​… దేశంలోనే అత్యంత పాత పారామిలటరీ ఫోర్స్. ఈ బలగం పనితీరును ఆర్మీ, అడ్మినిస్ట్రేషన్​ వ్యవహారాలను హోం శాఖ​ చూస్తున్నాయి.  దీన్ని పూర్తిగా తన కంట్రోల్​లోకి తెచ్చుకోవటానికి హోం శాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్మీ అడ్డు తగులుతోంది. ఈ గొడవ ఇప్పటిది కాదు. చాలా కాలంగా జరుగుతోంది. ఈ మధ్య మరోసారి తెరపైకి వచ్చింది. అస్సాం రైఫిల్స్​ హండ్రెడ్​ పర్సంట్​ మా కంట్రోల్​లోనే ఉండాలంటూ హోం శాఖ ఇచ్చిన ప్రపోజల్ ప్రస్తుతం​ ప్రధాని మోడీ దగ్గర పెండింగ్​లో ఉంది. ‘కేబినెట్​ కమిటీ ఆన్​ సెక్యూరిటీ (సీసీఎస్​)’ భేటీలో ఈ అంశం అటోఇటో తేలనుంది. దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్​ నోట్​ని హోం శాఖ సీసీఎస్​ మీటింగ్​లో ప్రవేశపెట్టనుంది. అస్సాం రైఫిల్స్​ని ‘ఏ టూ జెడ్’​ హోం శాఖకు అప్పగిస్తే నేషనల్​ సెక్యూరిటీకి తీవ్ర సమస్యలు తలెత్తుతాయన్నది సైన్యం ఆందోళన. ముఖ్యంగా పొరుగు దేశం చైనాతో పేచీ ఉన్న బోర్డర్​లో ఇబ్బంది రావచ్చని, అందువల్ల ఇప్పుడున్నట్లే కొనసాగించాలని కోరుతోంది. దీంతోపాటు మరో రిక్వెస్ట్​ కూడా చేస్తోంది.

చైనాని దారికి తేవాలంటే..

సరి‘హద్దు’ మీరుతున్న చైనాకు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఇండో–చైనా బోర్డర్​ వెంట గార్డ్​ డ్యూటీలో తాను కూడా పాలుపంచుకుంటానని ఆర్మీ చెబుతోంది. ఆ బోర్డర్​లో ఐటీబీపీ కాపలా కాస్తోంది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని డిఫెన్స్​ మినిస్ట్రీని ఈ మధ్యనే అడిగింది. హోం శాఖ ఆలోచన మరోలా ఉంది. అస్సాం రైఫిల్స్​ ప్రస్తుతం ఇండియా–మయన్మార్​ సరిహద్దులో రక్షణ పనులు చూస్తోంది. దీని​పై అజమాయిషీ అంతా తన చేతిలోకి వచ్చాక ‘ఇండో–టిబెటన్​ బోర్డర్​ పోలీస్​ ఫోర్స్​(ఐటీబీపీ)’లో కలిపేయాలని చూస్తోంది.

ఇండో–భూటాన్​ బోర్డర్​లో గస్తీ తిరుగుతున్న ‘సశస్త్ర సీమా బల్ (ఎస్​ఎస్​బీ)’ మరో ‘సెంట్రల్​ ఆర్మ్​డ్ పోలీస్​ ఫోర్స్​ (సీఏపీఎఫ్​)’ అనే విషయం తెలిసిందే. ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ… రెండూ కేంద్ర హోం శాఖ పరిధిలోకే వస్తాయి. అమిత్​షా హోం శాఖ మంత్రిగా, ఆ శాఖ మాజీ సెక్రెటరీ రాజీవ్​ గౌబా ఇప్పుడు కేబినెట్​ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టాక ఇండో–భూటాన్​ బోర్డర్​లోని సెక్యూరిటీ ఆపరేషన్స్​ అన్నింటినీ తామే టేకోవర్​ చేయాలని అనుకుంటున్నారు. హోం శాఖ కంట్రోల్​లోకి మొత్తంగా రాని ఒకే ఒక పారామిలటరీ ఫోర్స్​ అస్సాం రైఫిల్స్​ మాత్రమే. ఈ లోటును భర్తీ చేయటానికి అమిత్​ షా, రాజీవ్​ గౌబా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వాళ్ల ప్రపోజల్​కి ప్రధాని మోడీ గనక ఓకే అంటే… అది అమిత్​ షా సాధించిన అతి పెద్ద అచీవ్​మెంట్​ అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  అస్సాం రైఫిల్స్​ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న చాలా సమస్యలు కూడా పరిష్కారమవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో కొత్త గొడవలకు దారి తీస్తుందని విమర్శిస్తున్నారు.

2013లోనూ తెరపైకి..

అస్సాం రైఫిల్స్​ వ్యవహారం యూపీఏ–2 హయాం (2013 జనవరి)లోనూ తెరపైకి వచ్చింది. ఇండో–మయన్మార్​ బోర్డర్​లో ఈ బలగానికి బదులు ‘బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్)’ని పెట్టాలని హోం శాఖ ప్రతిపాదించింది. రైఫిల్స్​ ఆపరేషనల్ కంట్రోల్​ని తన పరిధిలోకి తెచ్చుకోవాలని చూసింది. సీసీఎస్​ భేటీలో చర్చకు డ్రాఫ్ట్​నీ రెడీ చేసింది. రైఫిల్స్​ స్థానంలో బీఎస్​ఎఫ్​ని మోహరించాలనటంపై ఎలాంటి అభ్యంతరమూ చెప్పని డిఫెన్స్​ మినిస్ట్రీ… దాని ఆపరేషనల్​ కంట్రోల్​ని వదులుకోవటానికి మాత్రం ససేమిరా అన్నది.

ఈ అంశం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. దీనిపై చర్చించటానికి కేబినెట్​ సెక్రటరీ రాజీవ్​ గౌబా.. డిఫెన్స్​ మాజీ సెక్రెటరీ సంజయ్ మిత్రాతో భేటీ అయ్యారు. ఈ విషయాలన్నింటినీ హోం శాఖ కోర్టుకు వివరించింది. సీసీఎస్​ తాజా భేటీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పింది. దీంతో హైకోర్టు కేబినెట్​ సెక్రెటరీకి నోటీసు జారీ చేస్తూ, సీసీఎస్ నిర్ణయాన్ని తమకు చెప్పాలని సూచించింది. ప్రధాని మోడీ​ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తింపే పెద్ద సమస్య

అస్సాం రైఫిల్స్​పై పెత్తనాన్ని రెండు శాఖలు పంచుకుంటూ ఉండటం వల్ల సవాలక్ష ఇబ్బందులు వస్తున్నాయని ఈ ఫోర్స్​లో పనిచేసి రిటైరైనవాళ్లు చెబుతున్నారు. ‘అస్సాం రైఫిల్స్​ ఎక్స్​–సర్వీస్​మెన్​ వెల్ఫేర్’ పేరిట వీళ్లంతా ఒక​ అసోసియేషన్​గా ఏర్పడి, తమ కష్టాలను ఇటీవల కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక వైపు మిలటరీ, మరో వైపు పారా మిలటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్​ని ‘పోలీస్​ ఫోర్స్​’ కేటగిరీగా ట్రీట్​ చేయడం పక్షపాతంగా, హక్కుల ఉల్లంఘనగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమకు ఆర్మీతో సమానంగా పేమెంట్లు, అలవెన్స్​లు, పెన్షన్లు, ఎక్స్​సర్వీస్​మెన్​ ఫెసిలిటీస్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అస్సాం రైఫిల్స్​ని కంప్లీట్​గా డిఫెన్స్​ మినిస్ట్రీ పరిధిలోకి తెచ్చేలా ఆదేశాలు జారీచేయాలని వారు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి అస్సాం రైఫిల్స్​ని రెండు శాఖల పరిధిలో ఉంచాలని ‘గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా (అలొకేషన్​ ఆఫ్​ బిజినెస్) రూల్స్​–1961’లో సైతం లేదు.

రిటైర్మెంట్​కి ముందు, తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా సైనిక కమాండర్ల కింద ఆర్మీ డ్యూటీ చేస్తున్న పారామిలటరీ ఫోర్స్ ​కూడా అస్సాం రైఫిల్స్​ మాత్రమే. ఈ బలగంపై అధికారం మొత్తం తామే చెలాయించే ఛాన్స్​ కోసం హోం, డిఫెన్స్​ మినిస్ట్రీలు ఎన్నో ఏళ్లుగా పోటీపడుతున్నాయి. ఇండో–చైనా యుద్ధం (1962) తర్వాత అస్సాం రైఫిల్స్​పై ఆపరేషనల్​ కంట్రోల్​ని ఆర్మీకి ఇచ్చారు. ఇది జరిగిన మూడేళ్ల అనంతరం హోం శాఖను ఈ ఫోర్స్​ పాలనా వ్యవహారాలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గుర్తింపే పెద్ద సమస్య

అస్సాం రైఫిల్స్​పై పెత్తనాన్ని రెండు శాఖలు పంచుకుంటూ ఉండటం వల్ల సవాలక్ష ఇబ్బందులు వస్తున్నాయని ఈ ఫోర్స్​లో పనిచేసి రిటైరైనవాళ్లు చెబుతున్నారు. ‘అస్సాం రైఫిల్స్​ ఎక్స్​–సర్వీస్​మెన్​ వెల్ఫేర్’ పేరిట వీళ్లంతా ఒక​ అసోసియేషన్​గా ఏర్పడి, తమ కష్టాలను ఇటీవల కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక వైపు మిలటరీ, మరో వైపు పారా మిలటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్​ని ‘పోలీస్​ ఫోర్స్​’ కేటగిరీగా ట్రీట్​ చేయడం పక్షపాతంగా, హక్కుల ఉల్లంఘనగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమకు ఆర్మీతో సమానంగా పేమెంట్లు, అలవెన్స్​లు, పెన్షన్లు, ఎక్స్​సర్వీస్​మెన్​ ఫెసిలిటీస్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అస్సాం రైఫిల్స్​ని కంప్లీట్​గా డిఫెన్స్​ మినిస్ట్రీ పరిధిలోకి తెచ్చేలా ఆదేశాలు జారీచేయాలని వారు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి అస్సాం రైఫిల్స్​ని రెండు శాఖల పరిధిలో ఉంచాలని ‘గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా (అలొకేషన్​ ఆఫ్​ బిజినెస్) రూల్స్​–1961’లో సైతం లేదు.

రిటైర్మెంట్​కి ముందు, తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా సైనిక కమాండర్ల కింద ఆర్మీ డ్యూటీ చేస్తున్న పారామిలటరీ ఫోర్స్ ​కూడా అస్సాం రైఫిల్స్​ మాత్రమే. ఈ బలగంపై అధికారం మొత్తం తామే చెలాయించే ఛాన్స్​ కోసం హోం, డిఫెన్స్​ మినిస్ట్రీలు ఎన్నో ఏళ్లుగా పోటీపడుతున్నాయి. ఇండో–చైనా యుద్ధం (1962) తర్వాత అస్సాం రైఫిల్స్​పై ఆపరేషనల్​ కంట్రోల్​ని ఆర్మీకి ఇచ్చారు. ఇది జరిగిన మూడేళ్ల అనంతరం హోం శాఖను ఈ ఫోర్స్​ పాలనా వ్యవహారాలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నష్టమే ఎక్కువ

రైఫిల్స్​ ఆపరేషనల్​ కంట్రోల్​ని హోం శాఖ పరిధిలోకి తెస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది.  రైఫిల్స్​ని హోం శాఖ కంట్రోల్​లోకి తెస్తే.. చివరికి అది గుర్రమూ, గాడిదా ఏదీ కాకుండా పోతుంది.

–  కల్నల్​ (రి) అజయ్​ శుక్లా , డిఫెన్స్​ కామెంటేటర్

Latest Updates