చెలరేగిన ఢిల్లీ..SRHకు బిగ్ టార్గెట్

చెలరేగిన ఢిల్లీ..SRHకు బిగ్ టార్గెట్

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌ లో భాగంగా హైదరాబాద్ తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బిగ్ స్కోర్ చేసింది.  ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(78) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఢిల్లీ  20 ఓవర్లలో 3 వికెట్లకు 189 రన్స్ చేసింది. మరో ఓపెనర్‌ మార్కస్‌ స్టాయినీస్‌(38), హెట్‌మైర్‌(42 నాటౌట్‌)రాణించడంతో ఢిల్లీ ఛాలెంజింగ్ స్కోర్ చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో.. రషీద్ ఖాన్, సందీప్ శర్మ,హోల్డర్ తలో వికెట్ తీశారు.