పిల్లల పెంపకంలో శిల్పా సక్సెస్‌‌ 

తెలుగు పాపులర్​ యాంకర్‌‌ శిల్పా చక్రవర్తికి ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు, ఇంకొకరికి ఐదేళ్లు. చాలా కాలం నుంచి ఆమె ఫోన్‌‌, ఐపాడ్‌‌, ల్యాప్‌‌టాప్‌‌తోనే ఎక్కువ సమయం గడిపేది. భర్త కూడా తన పనుల్లో బిజీగా ఉండేవాడు. పిల్లలకు టైమ్‌‌ కేటాయించే పెద్దవాళ్లు లేక వాళ్లూ గాడ్జెట్లతోనే టైమ్‌‌ పాస్‌‌ చేస్తుండేవాళ్లట. ‘జీవితమంటే గాడ్జెట్లతో గడిపేయడమేనని పిల్లలు అనుకునేవారని, ఇలా పెరగడమంటే ఆనందాలను కోల్పోవడమేన’ని తొందరగానే గుర్తించానంటోంది శిల్పా చక్రవర్తి. దసరా సెలవుల్లో ప్రతి రోజూ పిల్లలకు కొంత సమయం కేటాయించడం మొదలుపెట్టిన తర్వాత.. ‘పిల్లలూ, నేను హ్యాపీగా ఉన్నాం. గాడ్జెట్స్‌‌ లేకుండా చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. కొడుకుని తబలా క్లాస్‌‌కి, బిడ్డని టెన్నిస్‌‌ ఆటకి పంపిస్తున్న. రాత్రి వాళ్లతో కలిసి భోజనం చేసి, కథలు చెబుతూ నిద్రపుచ్చుతున్నా’నంటోంది.

‘మీరూ మారండి. మీతోనే మేముంటామని పిల్లలకు ప్రామిస్‌‌ చేయండి’ అంటోంది శిల్ప. పేరెంట్స్‌‌ అందరూ పిల్లలతో గడపాలని నిర్ణయంతో గాడ్జెట్స్‌‌ని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. శిల్పా మాత్రం ఎప్పుడో ఈ సమస్యను గుర్తించింది. అందుకే ముందే పిల్లల్ని దారిలో పెట్టింది. మొక్కై వంగనిది మానై వంగదు. అందుకే పిల్లలకు ఏ ఆటలు ఇష్టమో తెలుసుకుని శిక్షణ ఇప్పించాలి. ఏ కళలంటే ఆసక్తో గుర్తించి సాధన చేయించాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రతి రోజూ పిల్లల కోసం టైమ్‌‌ కేటాయించాలి. తెలుసుగా.. ఏం చేయాలో? గాడ్జెట్స్‌‌ని కాసేపు పక్కన పడేయాలి.

Latest Updates