బుట్ట బొమ్మ పాటకి డాన్స్ వేసిన సాగర కన్య 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఆ మూవీ సాంగ్స్ యూ ట్యూబ్ లో దుమ్ము రేపాయి. కుర్రకారు అయితే ఈ పాటలకు ఫిదా అయిపోయారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత… అందులోని ‘బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే… జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ పాటలో హీరోహీరోయిన్లు వేసిన స్టెప్స్ ను  టిక్ టాక్ లో ప్రతీ ఒక్కరూ ఫాలో అవుతున్నారు. భాషాభేదం లేకుండా  అన్ని రాష్ట్రాల వారు ఈ స్టెప్స్ తో టిక్ టాక్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, మన సాగర కన్య శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసింది. పేరుకు తగ్గట్టుగా కదిలే శిల్పంలా ఆమె వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తమన్ సంగీతం అందించిన ఈ బుట్టబొమ్మ పాటని రామజోగయ్యశాస్త్రి రాయగా.. అర్మాన్‌ మాలిక్‌ పాడారు.

Latest Updates