షైన్ హాస్పిటల్ అగ్ని ప్రమాదం: చిన్నారుల ఆరోగ్యం విషమం

హైదరాబాద్: ఎల్బీనగర్ లోని షైన్ చిల్ డ్రన్ హాస్పిటల్ లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. హాస్పిటల్ యజమాని డాక్టర్ సునిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాద కారణాలపై క్లూస్ టీం తనిఖీలు నిర్వహిస్తుంది. ఆపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిపింది కమిటీ. ఇప్పటికే హాస్పిటల్ కు నోటీసులు జారీచేశారు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. దీంతో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనికీచేస్తున్నారు. షైన్ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈరోజు చైల్ట్ రైట్స్ కమీషన్ షైన్ హాస్పిటల్ ను పరిశీలించనున్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు.

Latest Updates