షిర్డీ ఆలయం మూసివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ పైనా పడింది. దీంతో ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టిన ఆలయాధికారులు షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇవాళ (మంగళవారం,మార్చి-17) మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

షిర్డీ సాయి ఆలయానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే భక్తులు షిర్డీ టూర్ ను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు ఆలయాధికారులు.

Latest Updates