కరోనా నివారణకు సరికొత్త మాస్క్

మనదేశంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఐఎస్ ఓ సర్టిఫైడ్ పొందిన మెడిక్ విరోస్టాస్ మాస్క్ అందుబాటులోకి వచ్చింది. కోయంబత్తూర్ కు చెందిన శివ టెక్స్ యార్న్ సంస్థ తయారు చేసిన ఈ మాస్క్ నాలుగు రంగులతో రెండు సైజుల్లో ఉంటుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ సుందరరామన్ వెల్లడించారు. ఈ మాస్క్ ధర సైజును బట్టి రూ.49 నుంచి రూ.69 ఉంటుందని  తెలిపారు. విరోస్టాస్ మాస్క్ ధరించడం వల్ల 99శాతం కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని, వాష్ చేసినా మాస్క్ లో ఎలాంటి మార్పులు ఉండవని  సుందరరామన్ అన్నారు. సామాన్యులకు తక్కువ ధరకే ఎక్కువ రక్షణ కల్పించడమే తమ లక్ష్యమన్న ఆయన ..తమ మాస్కులు కరోనాతో పాటు గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేశారు.

Latest Updates