కాంగ్రెస్ కథ ముగిసింది.. ఏపీలో 25లక్షల సభ్యత్వాలు: శివరాజ్ సింగ్

దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిపోయిందని అన్నారు బీజేపీ నాయకులు, ఎంపీ మాజీసీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.  ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన… చాలా రాష్ట్రాల్లో బీజేపీ జీరో నుంచి అధికారం చేపట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. బీజేపీ ధాటికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షపదవిని వదిలి పారిపోయాడని ఎద్ధేవాచేశారు. కెప్టెన్ అనేవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడి పోరాడాలని అన్నారు. రాహుల్ దారిలోనే పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా తమ పదవిని వదిలేశారని చెప్పారు.

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు  కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. టిడిపి పరిస్థితి అలానే ఉండబోతుందని చెప్పారు. ప్రధాని మోడిని  తిట్టడమే తప్ప….‌ చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కు అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆంధ్రాలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. బిజెపి వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించదని.. మోడి నేతృత్వంలో పేదలు, రైతులు , మహిళల ఆనందంగా ఉన్నారని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తూ మోడి ప్రపంచ దేశాలకు  ఆదర్శంగా మారారని అన్నారు.

బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు శివరాజ్. ఎపీలో 25లక్షల సభ్యత్వాల నమోదే తమ లక్ష్యం అని అన్నారు… సభ్యత్వ నమోదు కార్యక్రమం తో పాటు మొక్కల నాటే కార్యక్రమం మోడి శ్రీకారం చుట్టారని చెప్పారు… సబ్ సాత్ సబ్ వికాస్ అనేదే బీజేపీ నినాదమని… 2025 నాటికి ఏపీ లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరేందుకు ఏపీ నుంచి చాలా మంది నేతలు రెడీగా ఉన్నారని తెలిపారు.

చంద్రబాబు ముందుగా.. ప్రత్యేక హోదా వద్దని.. ప్యాకేజీ కి అంగీకరించారు….అందుకు అనుగుణంగా కేంద్రం కూడా అనేక రూపాలలో నిధులు ఇచ్చిందని చెప్పారు. 17వేల కోట్లు ఎపీ అభివృద్ధికి మోడీ ఇస్తే.. వాటిని చంద్రబాబు దారి మళ్లించి..‌జేబులో‌ వేసుకున్నారని అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఎన్నికలలో మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని అసత్యాలు ప్రచారం చేశారని చెప్పారు.. విపక్షాలు చెప్పిన విధంగా మోడీ పాలన  సరిగ్గా లేకుంటే.. రెండోసారి ప్రజలు ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు..పార్టీకి సేవ చేయాలనుకునేవారికి బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిసే ఉంటాయన్నారు.. పార్టీ వారికే పెద్ద పీట వేస్తుందని చెప్పారు.