భారత క్రికెట్ ను మార్చిన వ్యక్తి గంగూలీ

బీసీసీఐ అద్యక్షుడిగా నామినేషన్ వేసిన గంగూలీని పలువురు సీనియర్ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్న సచిన్, లక్ష్మణ్, సెహ్వాగ్ గంగూలీకి విషెస్ చెప్పగా లెటెస్ట్ గా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో గంగూలీపై ప్రశంసలు కురిపించాడు. గంగూళీ భారత క్రికెట్ ను మార్చిన వ్యక్తి అని కొనియాడాడు. గంగూలీకి క్రికెట్ పై పూర్తి అవగాహన ఉందని.. ఆటగాళ్ల ఆలోచనను మార్చే వ్యక్తి గంగూలీ అని అన్నాడు. 1997-98 కు ముందు భారత్ పాక్ ను ఓడిస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నాడు. గంగూళీ భారత కెప్టెన్ అయ్యేంత వరకు టీమిండియా పాక్ ను ఓడించే సత్తా ఉందని అనుకోలేదన్నాడు షోయబ్ అక్తర్.

Latest Updates