కుమారస్వామికి సీఎంగా కొనసాగే అర్హత లేదు

కర్ణాటకలో  సీఎంగా కొనసాగేందుకు కుమారస్వామికి అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్  నేత శోభా కరంద్లాజే డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె కోరారు. స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి.. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని ఆమె స్వాగతించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు మద్దతిస్తే తాము స్వీకరిస్తామన్నారు.  రాజీనామా చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యెలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు శోభా కరంద్లాజే.

Latest Updates