సెలబ్రిటీలు, సినీ స్టార్స్ కు ఎన్నికల్లో షాక్

shock-to-celebrities-and-movie-stars

2019 లోక్ సభ ఎన్నికల్లో చాలామంది సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ కు షాకిచ్చాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ టికెట్లపై పోటీచేసిన కొందరు.. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన మరికొందరికి చేదు ఫలితాలు వచ్చాయి.

ఓటమి బాటలో జయప్రద

యూపీ రాంపూర్ లోక్ సభ సెగ్మెంట్ లో BJP టికెట్ పై పోటీ చేసిన జయప్రద 30వేల ఓట్ల పైచిలుకు ఓట్ల వెనుకంజలో ఉన్నారు. 57 ఏళ్ల జయప్రద పై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

ఊర్మిళ మాతోండ్కర్ వెనుకంజ

కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రంగీలా స్టార్ ఊర్మిళ మాతోండ్కర్  వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి.. ఆమెపై 80వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

బాక్సర్ విజేందర్ ట్రయల్

సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసిన బాక్సర్ విజేందర్ సింగ్ 73వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

ప్రకాశ్ రాజ్ వెనుకంజ

బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సౌతిండియన్ మూవీ స్టార్ ప్రకాశ్ రాజ్ వెనుకంజలో ఉన్నారు. తాను ప్రచారం ఆలస్యంగా ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఏ పార్టీ మద్దతు లేకుండా తాను బరిలోకి దిగాననీ.. తన పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతుందని చెప్పారాయన.

Latest Updates