షాకింగ్ వీడియో: కారుతో గుద్ది అలాగే రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

చత్తీస్‌ఘర్‌లోని రాయ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలుకాగా, మరో వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 13న రాత్రిపూట బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి పక్కకు పడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. కానీ, మరో వ్యక్తి మాత్రం కారు ముందు భాగంలో పడ్డాడు. ప్రమాదం జరగడంతో కారులోని వ్యక్తి భయపడి కారును ఆపకుండా అలాగే ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. కారు ముందు పడ్డ వ్యక్తిని గమనించకుండా ముందుకు వెళ్లడంతో కారు రోడ్డుపై పడ్డ వ్యక్తిని అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి తీవ్ర గాయాలయి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదమంతా రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ప్రమాదం ఎలా జరిగింది.. వ్యక్తి ఎంతగా గాయపడి ఉంటాడో ఆ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. కేసు నమోదు చేసిన పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

Latest Updates