ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం.. బాలిక డెడ్ బాడీని పీక్కుతిన్న కుక్కలు

ప్రభుత్వాసుపత్రిలో బాలిక డెడ్ బాడీని కుక్కలు పీక్కుతినడం కలకలం రేపుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. సంబాల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన గంట తరువాత ఆమె డెడ్ బాడీని కుక్కలు పీక్కుతిన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణంపై బాలిక తండ్రి చరణ్ సింగ్.. ప్రభుత్వాసుస్పత్రి డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే చరణ్ సింగ్ విమర్శలపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరిటెండెంట్ స్పందించారు. ఆసుపత్రి లోపల కుక్కల భయం ఉందని,  స్థానిక అధికారులకు లేఖ రాసినా ఎవరు స్పందించలేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే మార్గం మధ్యలో చనిపోయిందని, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తరువాత డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించినా తల్లిదండ్రులు తీసుకోలేదని ఆస్పత్రి డాక్టర్ సుశీల్ వర్మ అన్నారు.

మరోవైపు ఈ దారుణంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆస్పత్రి అధికారులు వార్డ్ బాయ్ తో పాటు, స్వీపర్ ను విధుల నుంచి తొలగించారు. తాము అత్యవసర ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి చెందిన మరో వార్డ్ కి వెళ్లామని, వెళ్లేముందు మార్చురీ బాధ్యతలు తీసుకోవాలని వార్డ్ బాయ్, స్వీపర్ కు చెప్పి వెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates