గురువు.. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే శక్తి అని అర్థం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి, సన్మార్గంలో నడిపించడంలో గురువులదే కీలక పాత్ర. అందుకే సమాజంలో గురువులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి గురువుకే ఉంటుంది. అందుకే గురువును దైవంగా భావిస్తుంటారు. కానీ కొందరు గురువులు చేసే పనులు చూస్తుంటే మాత్రం ఆ వృత్తికే తలవొంపులు తెచ్చిపెడుతోంది.
రాజస్థాన్ లో జరిగిన ఓ సంఘటన టీచర్ వృత్తికే తలవంపులు తీసుకొచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ లోని ఓ పాఠశాల క్లాస్ రూమ్ బెంచీపై కూర్చున్న విద్యార్థి ఓ చిన్నారి జుట్టు పట్టుకొని నేలపైకి విసిరి పడేసింది. దీంతో విద్యార్థి చేయి బెణికి.. కనపడని గాయాలయ్యాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న విద్యార్థినిపేరంట్స్ ఘటనకు పాల్పడిన టీచర్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తరగది గదిలో బాలిక జుట్టు పట్టుకొని నేలపై విసిరేసిన టీచర్.. బాలికకు గాయాలు#Rajasthan #schoolstudent pic.twitter.com/03xE4zQpwj
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) August 6, 2024
