అమెరికాలో కాల్పుల మోత..ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. శనివారం నార్త్ టెక్సాస్ లోని ఓడెస్సా లోని షాపింగ్ సెంటర్ వద్ద  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. వెంటే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఒక దుండగుడిని కాల్చి చంపారు.

షాపింగ్ సెంటర్ వద్ద  ట్రాఫిక్ ఆగినప్పుడు పౌరులపై కాల్పులు జరిపాడని ఒడెస్సా పోలీసు విభాగం చీఫ్ మైఖేల్ గెర్కే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఆ కాల్పుల్లో ముగ్గురు ఈడీ ఆఫీసర్లు, ఒక పౌరుడు గాయపడ్డారని చెప్పారు. ఒడెస్సా శివార్లలోని ఒక సినిమా థియేటర్ సమీపంలో 30 ఏళ్ల మధ్యలో ఉన్న ముష్కరుడిని కాల్చినట్లు చెప్పారు మైఖేల్ గెర్కే.

Latest Updates