కెనడా లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు…16 మంది మృతి

ఒట్టావా : కెనడా లో 51 ఏళ్ల గాబ్రియేట్ వోర్ట్ మెన్ అనే మాజీ డెంటల్ డాక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. పోలీస్ డ్రెస్ ధరించి తన వాహనాన్ని పోలీస్ వాహనంగా మార్చి ఆదివారం రాత్రి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ లేడీ పోలీస్ సహా 16 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. కెనడాలోని స్కోటియా అనే టౌన్ లో ఈ సంఘటన జరిగింది. నోవా స్కోటియాలోని పలు ప్రాంతాల్లో వెహికిల్ పై తిరుగుతూ విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితున్ని వెంబడించారు. కాల్పులు జరిపిన ప్రాంతం నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరం వరకు నిందితుడు పారిపోయాడు. పోర్ట్ అపిక్వ్ టౌన్ సమీపంలో నిందితున్ని గుర్తించి పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత 30 ఏళ్లలో దేశంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన ఇది పోలీసులు తెలిపారు. 1989 లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 14 మంది పాలిటెక్నిక్ విద్యార్థినులు చనిపోయారు. అప్పటి నుంచి గన్స్ వాడకంపై ఆంక్షలు విధించారు. నిందితుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Updates