షూటింగ్ వరల్డ్ కప్: తొలి గోల్డ్ మనదే

చైనా షూటర్ ను ఓడించిన స్వర్ణం సొంతం చేసుకున్న అపూర్వి
న్యూఢిల్లీ: షూటింగ్ వరల్డ్ కప్ లో భారత్ గురి నిలిచింది. ప్రపంచ కప్ ఆరంభంలోనే భారత షూటర్ గోల్డ్ మెడల్ సాధించారు. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఉమెన్ ఈవెంట్లో అపూర్వి చందేలా స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. 252.9 పాయింట్స్ తో చైనా షూటర్ రువోఝు జావోపై భారీ విక్టరీ సాధించారు. ప్రపంచ కప్ మొదలయ్యాక తొలి మెడల్ కూడా ఇదే కావడం విశేషం.
అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) నిర్వహిస్తున్న షూటింగ్ ప్రపంచ కప్ ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ లో ఈ రోజు ఉదయం స్టార్ట్ అయింది. ఈవెంట్ స్టార్టింగ్ లోనే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలోతొలి మెడల్ భారత షూటర్ గెలుచుకోవడం విశేషం.
Shooting World Cup Day: Apurvi Chandela wins gold in 10m air rifle final

Latest Updates