గుంత లేని రోడ్ చూపించు.. ఓటు అడుగు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

హైదరాబాద్: ఎన్నికల సమయంలో మీరు మేము కలిసి తిరుగుదాం.. ఒక కిలోమీటర్ నడుద్దాం.. ఒక్క గుంత లేని రోడ్ చూపించు.. ఓటు అడుగు.. అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. గ్రేటర్ ప్రజలు ఓటు తో తమ సత్తా చాటేందుకు రడీ అయ్యారు… టీఆర్ఎస్ ప్రకటించింది ప్రగతి నివేదిక కాదు… ప్రచార నివేదిక.. అందులో బొమ్మలు తప్ప ఏమీలేదు.. ఆ బొమ్మల్లో గుంతలు పడ్డ రోడ్లు,  జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. నివేదికలో హైదరాబాద్ చేరువులా మారిన బొమ్మలు ఎందుకు లేవు? అని ఆయన ప్రశ్నించారు.

డిసెంబర్ 4 న గ్రేటర్ ప్రజలు అసలు నివేదిక ఇస్తారు

వచ్చేనెల 4న గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ కు అసలు నివేదిక ఇవ్వబోతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. సంవత్సరాని కి 70 వేల కోట్ల రూపాయలు గ్రేటర్ ప్రజలు టాక్స్ ల రూపంలో కడుతున్నారు.. ఈ ఆరున్నర ఏళ్లలో నాలుగున్నర లక్షల కోట్లు హైదరాబాద్ ప్రజలు పన్నులు కట్టారు.. 67 వేల కోట్ల తో అభివృద్ధి చేశాము అని అంటున్నారు..  పదే పదే తెలంగాణ కేంద్రానికి ఇచ్చిన దాంట్లో ఎంత తిరిగి ఇస్తున్నారు అని అడుగుతున్నారు.. నేను హైదరాబాద్ పౌరునిగా అడుగుతున్నా.. గ్రేటర్ ఇచ్చిందెంత..  గ్రేటర్ కి మీరు ఖర్చు చేసింది ఎంత మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అహనా పెళ్లంట సినిమా సీన్ గుర్తుకొస్తుంది

ఈ ఆరున్నర ఏళ్లలో 431 డబుల్ బెడ్రూం ఇల్లు మాత్రమే కట్టారంటూ  రాజేంద్ర ప్రసాద్ నటించిన పాత అహనా పెళ్ళంట  సినిమాలో కోట శ్రీనివాస్ రావు దూలానికి కోడిని కట్టి లొట్టలు వేసుకున్న సీన్ గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. మెట్రో ప్రారంభోత్సవానికి పీఎం వస్తే బీసీ అయిన మేయర్ ని పిలవలేదు వీళ్ళు.. వాళ్లంటే చులకనా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ప్రగతి తప్ప..  వారికి ఎవరి ప్రగతి వద్దని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు మేము కలిసి తిరుగుదాం.. ఒక కిలోమీటర్ నడుద్దాం.. ఒక్క గుంత లేని రోడ్ చూపించు.. ఓటు అడుగు.. అని బీజేపీ నేత లక్ష్మణ్ సవాల్ చేశారు. హైదరాబాద్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారింది.. అర్థరాత్రి సైతం మద్యం అమ్మకాలు.. పబ్ కల్చర్ కి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 15 డంపింగ్ యార్డ్ లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. వైకుంఠ ధామాల కు ఇచ్చిన నిధులు కేంద్రానివేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి అని ఆయన విమర్శించారు.  గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీసీ లకు (56 శాతం) ఇచ్చాము.. నాలుగు జనరల్ సీట్లలో ఎస్సీ లకు ఇచ్చామని వివరించారు. కేకే టీఆర్ఎస్ పార్టీ కి అధ్యక్షుడు అవుతాడా.. ?  కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయితాడా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ బీసీ ల పట్ల దేవుడు కాదు రాక్షసుడు అని ఆరోపించారు.

స్వామి గౌడ్ తో రాజకీయాలు మాట్లాడాం

స్వామిగౌడ్ తో భేటీ ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రస్తావించారు. రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా ఎలా ఉంటాం.. కల్వకుంట్ల కుటుంబం వ్యవహారం పై మాట్లాడాం.. ఉద్యమ ద్రోహులకు పెద్ద పీట వేసి…  ఉద్యమ కారులను అణచిన అంశాలపైనా చర్చించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇంకా చాలా మందిని కలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates