జడ్జిని బెదిరించారు: మరియం

‘మా నాన్న కేసును విచారించిన జడ్జిని బ్లాక్​మెయిల్​చేసి, బలవంతంగా దోషి అని తీర్పిచ్చేలా చేశార’ని పాక్​మాజీ ప్రధాని నవాజ్​షరీఫ్​కూతురు మరియం నవాజ్​సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి విషయంలో న్యాయవ్యవస్థ మొత్తం రాజీ పడిందని విమర్శించారు. దీనికి రుజువుగా పాక్​ న్యాయమూర్తి ఒకరు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న వీడియోను ఆమె విడుదల చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో నవాజ్​షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ సరిగ్గా జరగలేదని, తమకు అన్యాయం జరిగిందని మరియం మొదట్నుంచీ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా కక్ష సాధించేందుకు తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పనామా పేపర్స్​సహా షరీఫ్​ఆరోపణలు ఎదుర్కున్న మరో రెండు కేసులను పాక్​కోర్టు గతేడాది విచారించింది. నవాజ్​షరీఫ్​ను ఇస్లామాబాద్​కోర్టు జడ్జి అర్షద్​మాలిక్​దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, ఆ తీర్పు తనకుతానుగా ఇవ్వలేదని, కొన్ని శక్తులు తనను బెదిరించడం వల్లే ఆ తీర్పిచ్చానని మాలిక్​ ఓ వీడియోలో చెప్పారు. నిజానికి షరీఫ్​అవినీతికి పాల్పడ్డారనేందుకు ఎలాంటి సాక్ష్యం లేదన్నారు. అయినా సరే షరీఫ్​ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వాలని బెదిరించడం వల్ల ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధించానని పీఎంఎల్‌‌ పార్టీ మద్దతుదారుడు నాసిర్​భట్ తో చెప్పారని మరియం వివరించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్​ను ఆమె మీడియాకు విడుదల చేశారు.

వీడియో క్లిప్​పై అనుమానాలు

మిరియం విడుదల చేసిన వీడియో క్లిప్​పై ఇమ్రాన్​ఖాన్​సర్కారు అనుమానం వ్యక్తం చేసింది. అది మార్ఫింగ్​చేసిన వీడియో అని ఆరోపించింది. సదరు వీడియోపై ఫోరెన్సిక్​ఆడిట్​జరిపించాలని చెప్పింది. తప్పుడు వీడియోతో మరియం న్యాయ వ్యవస్థపై దాడి చేస్తోందని విమర్శించింది.

Latest Updates