బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్ధాకపూర్!

డ్రగ్స్ కేసులో శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌‌కు సమన్లు!

ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ యాక్టర్స్ శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) ప్రశ్నించే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వారం వారిద్దరికీ సమన్లు జారీ చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకరు చెప్పారట. నటుడు సుశాంత్ మృతి కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి.. ఇన్వెస్టిగేషన్ లో శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ల పేర్లను వెల్లడించిందని పేర్కొన్నారు. 34 ఏళ్ల సుశాంత్  జూన్ 14న ముంబైలోని ఇంట్లో మృతి చెందారు. గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై సుశాంత్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. సుశాంత్ కు డ్రగ్స్ అరేంజ్ చేసినట్లు రియాపై ఆరోపణలు ఉన్నాయి. రియా చక్రవర్తి డిలీట్ చేసిన వాట్సప్ మెసేజ్ లను రిట్రీవ్ చేసిన అధికారులు.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మేనేజర్ శృతి ఎన్ సీబీ అధికారులు సోమవారం సమన్లు ఇచ్చారు.

For More News..

రిజిస్ట్రేషన్ రేట్లు ఇక ఫిక్స్‌డ్

Latest Updates