తమిళనాడు నుంచి శ్రీకాకుళం చేరుకున్న శ్రామిక్ రైలు

తమిళనాడు నుంచి వలస కార్మికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు ఇవాళ(మంగళవారం) ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. ఈ రైలులో 889 మంది వలస కార్మికులు వచ్చారు. వీరిలో 635 మంది మత్స్యకారులున్నారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన 35  ఉన్నారు. వారందరినీ   రెండు బస్సుల్లో విజయనగరం పంపించారు. మిగతా వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

889 మంది పది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి చెన్నై వలస వెళ్లారు. ఇవాళ 17 బోగీల్లో శ్రీకాకుళం చేరుకున్నారు.

Latest Updates