శ్రావణి కేసు: అశోక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రావణి మృతి కేసులో ఏ3 నిందితుడు అశోక్‌ రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉస్మానియా హాస్పిటల్ లో కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్ ‌రాజ్‌ రెడ్డి, ఏ 2 సాయికృష్ణా రెడ్డిలు పోలీసుల రిమాండ్ ‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపిన విషయం తెలిసిందే.

 

 

Latest Updates