మోత మోగించిన శ్రేయాస్, రాహుల్ .. కివీస్ కు బిగ్ టార్గెట్

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డేలో శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ దుమ్ము దులిపారు.  నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్  101 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సుతో  తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ చేసుకున్నాడు.తర్వాత కాసేపటికే( 103పరుగులు) ఔటయ్యాడు . ఇక ఐదో స్థానంలో వచ్చిన రాహుల్ చెలరేగాడు సిక్సులతో హోరెత్తించాడు. 64 బంతుల్లో ఆరు సిక్సులు, మూడు ఫోర్లతో 88 పరుగలు చేశాడు. భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ కు 348 టార్గెట్ ను నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు  కొత్త ఓపెనర్లు పృథ్వి షా 20, మయాంక్ అగర్వాల్ 32 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ 63 బంతుల్లో 51 పరుగులు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యార్, రాహుల్ తో కలిసి సిక్సులు, ఫోర్లతో చెలరేగి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.  శ్రేయస్ అయ్యార్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కేదర్ జాదవ్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. కేదర్ జాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి రెండు, గ్రంథోమ్ , ఇష్ సోధి తలో వికెట్ పడ్డాయి.

Latest Updates