మద్యం మానేసి ప్రశాంతంగా ఉంటున్నాను.. దీన్ని వక్రీకరించొద్దు

మద్యం మానేసి ప్రశాంతంగా ఉంటున్నాను.. దీన్ని వక్రీకరించొద్దంటోంది ముద్దుగుమ్మ శృతిహాసన్ . ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈముద్దుగుమ్మ..లండన్ లో మ్యూజిల్ ఆల్బమ్ లతో ఎంటర్ టైన్ చేసింది.  ప్రస్తుతం శృతి తమిళ హీరో విజయసేతుపతితో లాభం అనే చిత్రంలో యాక్ట్ చేస్తుండగా…ఓ తెలుగు టాక్ షోలో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పి హాట్ టాపిగ్గా మారింది. టాక్ షోలో తాను మద్యానికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు చెప్పింది. అంతే నెటిజన్లు శృతి  వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ శృతి ఆల్కహాలిక్  అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ సెటైర్లపై రియాక్ట్ అయిన  శృతి మనం 2019లో ఉన్నాం. నేను డ్రింక్ చేయనని చెబితే వాటిని వేరే రకంగా మార్చడం హాస్యాస్పదంగా ఉంది.  డ్రింక్ చేయడం వల్ల వ్యక్తి ప్రతిష్టకు భంగం కలగదు. కానీ  నేను మాత్రం ఆ పనిచేయను. డ్రింక్ చేసేవాళ్లు మేం డ్రింక్ చేశామని చెబుతారా..? నేను చెప్పా అంటూ ఘాటుగా రిప్లయి ఇచ్చింది శృతిహాసన్ .

Latest Updates