శ్రుతి హాసన్ కు నచ్చిన మామిడికాయ పప్పు

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా ఎప్పుడూ గరిట తిప్పని వారూ కిచెన్ లో హంగామా చేస్తున్నారు. సినీ స్టార్స్, క్రికెటర్స్ అనే తేడాలు లేకుండా అందరూ తమ ఇళ్లలో తోచిన పనులు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సరదాగా గడుపుతున్నారు. కొందరు హీరోయిన్స్ నోరూరే తెలుగు వంటకాలను స్వయంగా వండి ఆ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కళువ కళ్ల కాజల్ పాకశాస్త్రంలో తన ప్రావీణ్యం ఏంటో చూపించింది. తెలుగు వంటకాలను చాలా మిస్ అవుతున్నానని చెప్పిన కాజల్.. బెండకాయ పులుసు, పెసరట్టు ను చేసి తన పేరెంట్స్ కు వడ్డించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి చాలా వైరల్ అయ్యాయి.

తాజాగా గబ్బర్ సింగ్ భామ శ్రుతి హాసన్ కూడా తెలుగు డిషెస్ పై తన మక్కువ ఏంటో చెప్పింది. మామిడికాయ పప్పు అంటే తనకు చాలా ఇష్టం అని శ్రుతి తెలిపింది. ఈ మేరకు మామిడికాయ పప్పు చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మ్యాంగో పప్పు వండటం చాలా సులువు. నాకిది చాలా ఇష్టం. తొలిసారి చిన్నతనంలో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను దీన్ని టేస్ట్ చేశా. అప్పుడే దీని ప్రేమలో పడిపోయా’ అని శ్రుతి పేర్కొంది.

Latest Updates