నన్నెందుకు నామినేట్‌ చేయలేదు?

‘అర్జున’కు రికమెండ్‌ చేయకపోవడంపై షట్లర్‌ హెచ్ ఎస్ ప్రణయ్‌ గుస్సా

న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాది కూడా తనను అర్జున అవార్డుకు నామినేట్‌‌ చేయకపోవడంపై  షట్లర్‌‌ హెచ్‌‌ఎస్ ‌‌ప్రణయ్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్ ‌‌ఇండియా (బాయ్‌‌) తనకంటే తక్కువ స్థాయి ప్లేయర్లను ఈ పురస్కారానికి  సిఫారసు చేసిందన్నాడు. బాయ్‌‌మంగళవారం డబుల్స్‌‌ప్లేయర్లు సాత్విక్‌‌సాయిరాజ్‌‌, చిరాగ్‌‌షెట్టి.. సింగిల్స్‌‌ఆటగాడు సమీర్‌‌వర్మను అర్జునకు ప్రతిపాదించింది. ఈ లిస్ట్‌‌లో తన పేరు లేకపోవడంతో సోషల్ ‌‌మీడియా వేదికగా ప్రణయ్‌‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘అర్జున అవార్డుల విషయంలో మళ్లీ పాత కథే. కామన్వెల్త్‌‌గేమ్స్‌‌, ఏషియన్‌‌ చాంపియన్ ‌‌షిప్స్‌‌లో మెడల్స్‌‌నెగ్గిన వ్యక్తి (తాను)ని అసోసియేషన్ ‌‌కనీసం రికమెండ్‌ ‌కూడా చేయలేదు. కానీ, అలాంటి మేజర్‌‌ టోర్నీల్లో పోటీపడని వ్యక్తినేమో రికమెండ్‌‌ చేసింది. వావ్‌‌. ఈ దేశం నవ్వులాటగా మారింది’ అని ట్వీట్‌‌చేశాడు. అర్జున రేసులో నిలిచిన ముగ్గురిలో  సాత్విక్‌‌, చిరాగ్‌‌ కామన్వెల్త్‌ ‌గేమ్స్‌‌లో  సిల్వర్‌‌ నెగ్గారు. కానీ సమీర్‌ ‌వర్మ ఈ మెగా ఈవెంట్‌‌లో పోటీ పడలేదు.  లాస్ట్ ‌‌ఇయర్‌‌లో అతను పెద్దగా రాణించింది కూడా లేదు. అయితే, 2018లో  మాత్రం సమీర్‌‌ సత్తా చాటాడు. మూడు టైటిళ్లు నెగ్గడంతో పాటు కెరీర్‌‌ బెస్ట్ ‌‌వరల్డ్ ‌‌11వ ర్యాంక్‌‌సాధించాడు. అదే ఏడాది వరల్డ్‌ ‌టూర్ ‌‌ఫైనల్స్‌‌కు క్వాలిఫై అయి సెమీస్‌‌ వరకూ వెళ్లాడు. మరోవైపు అథ్లెట్లు, కోచ్‌‌ల నాలుగేళ్ల పెర్ఫామెన్స్‌‌ను బేరీజు వేసిన తర్వాతే వారి పేర్లను స్పోర్ట్స్‌ ‌మినిస్ట్రీకి రిఫర్ ‌‌చేసినట్టు బాయ్‌ ‌ప్రకటించింది.

అయితే, గతేడాది కూడా అర్జున ఆశించి భంగపడ్డ  ప్రణయ్‌‌.. ఏషియన్‌‌ చాంపియన్‌ ‌షిప్‌‌లో బ్రాంజ్‌ ‌నెగ్గడంతో పాటు 2018 మేలో వరల్డ్‌‌నం.8 ర్యాంక్‌‌ సాధించాడు. 2017 ఇండోనేసియా ఓపెన్‌‌లో వరుస మ్యాచ్‌‌ల్లో  మాజీ వరల్డ్‌‌నంబర్‌‌వన్‌‌లీ చోంగ్‌‌వీ, ఒలింపిక్ ‌‌చాంప్‌ ‌చెన్‌‌లాంగ్‌‌ను ఓడించిన ప్రణయ్ ‌‌సంచలనం సృష్టించాడు. 2016, 2020 ఏషియన్ ‌‌టీమ్ ‌‌చాంపియన్​షిప్​లో బ్రాంజ్‌ ‌మెడల్స్‌‌నెగ్గిన ఇండియా టీమ్‌‌లో మెంబర్‌‌ అయిన ప్రణయ్‌‌కు తెలుగు ఆటగాడు పారుపల్లి కశ్యప్‌‌ మద్దతుగా నిలిచాడు. అవార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ తనకెప్పుడూ అర్థం కాలేదన్నాడు. ఈ విధానం మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన కశ్యప్‌‌.. స్ట్రాంగ్‌‌గా ఉండాలని టీమ్‌‌మేట్‌‌కు సూచించాడు.

డెడ్‌‌లైన్ ‌‌పొడిగింపు.. సెల్ఫ్‌ ‌నామినేషన్‌‌కు అవకాశం

నేషనల్‌ ‌స్పోర్ట్స్‌‌అవార్డ్స్‌ ‌డెడ్‌‌లైన్‌‌ను సెంట్రల్‌‌స్పోర్ట్స్‌‌ మినిస్ట్రీ పొడిగించింది. ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రికమెండేషన్‌ ‌కోసం తిరిగే చాన్స్‌‌లేకపోవడంతో అథ్లెట్లు ‘సెల్ప్‌‌నామినేషన్స్‌‌’ను కూడా దాఖలు చేసుకోవచ్చని వెల్లడించింది. పాత షెడ్యూల్‌‌ ప్రకారం అవార్డుల అప్లైకి బుధవారం డెడ్‌‌లైన్‌‌. కానీ లాక్‌‌డౌన్ ‌‌నేపథ్యంలో చాలా మంది అధికారులు అందుబాటులో లేకపోవడంతో డెడ్‌‌లైన్ ‌‌పొడిగించారు.

ఖేల్‌‌రత్నకు నీరజ్‌‌చోప్రా

స్టార్‌‌ జావెలిన్ ‌‌త్రోవర్ ‌‌నీరజ్‌‌చోప్రాను అథ్లెటిక్స్‌ ‌ఫెడరేషన్‌ ‌ఆఫ్ ‌‌ఇండియా (ఏఎఫ్‌‌ఐ) రాజీవ్‌‌గాంధీ ఖేల్‌‌రత్న అవార్డుకు సిఫారసు చేసింది. ఇండియా ఫాస్టెస్ట్‌‌ వుమెన్ ‌‌ద్యుతీ చంద్‌‌ను వరుసగా మూడో ఏడాది అర్జునకు రికమెండ్‌‌ చేసింది. ఆమెతో పాటు అర్పిందర్‌‌సింగ్‌‌(ట్రిపుల్‌‌జంప్‌‌), మంజీత్‌‌సింగ్‌‌(800 మీ.), మిడిల్‌‌డిస్టెన్స్‌‌రన్నర్‌‌, ఏషియన్ ‌‌చాంపియన్‌‌ పీయూ చిత్ర కూడా అర్జునకు నామినేట్‌ ‌అయ్యారు.

For More News..

తెలంగాణ ఇస్తేనే.. మేం ఇస్తాం.. ప్రాజెక్టులపై ఏపీ మెలిక

ఎల్‌‌ఐసీకి రూ. 1.7 లక్షల కోట్ల నష్టం

సింగరేణి బాధితులకు రూ. 40 లక్షలు.. ఒక జాబ్

Latest Updates