రైతు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

si-caught-red-handed-by-acb-while-taking-bribe-230549-2

అవినీతికి పాల్పడుతూ ఓ సబ్ ఇన్ స్పెక్టర్ ACB అధికారులకు చిక్కాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడు SI క్రాంతికుమార్ రైతు దగ్గర రూ.40 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

భూమి పంచాయితీ పరిష్కారంలో ఉట్లపల్లి గ్రామానికి చెందిన రైతు నుంచి రూ.40 వేల డిమాండ్ చేశారు SI క్రాంతికుమార్. ఇదే విషయాన్ని హోంగార్డుకు చెప్పి డబ్బులు తీసుకురమ్మని పంపించారు. రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పథకం ప్రకారం… రైతు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సైని పట్టుకున్నారు ACB అధికారులు.

ఎస్సై క్రాంతికుమార్ అక్రమాలపై విచారణ చేస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఆయన ఇంటిలో సోదాలు చేశారు.

Latest Updates