
రాజన్నసిరిసిల్ల జిల్లా: పోలీసు శాఖలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ఎస్ఐ అన్నారం కనకయ్య (50) కరోనా వైరస్ తో మృతి చెందాడు. 15 రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బంధువులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కనకయ్య నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఈ విషయం వైరల్ కావడం పోలీసు శాఖలో గుబులు పుట్టించింది.