సొంత డబ్బుతో నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన ఎస్సై..

కొమురం భీం జిల్లాలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎస్సై రమేష్. రెబ్బన మండలం ఖైర్గాంలో ఓ కుటుంబానికి తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టించారు రమేష్.  గతేడాది మేనెలలో వర్షాలకు రమేష్ చారి అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయింది. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. పేపర్ లో వచ్చిన వార్త చూసి..తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు రమేష్. మూడు లక్షలు  ఖర్చు పెట్టి.. రమేష్ చారి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చారు.  గతంలోనూ చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు రమేష్. దహెగాం గ్రామంలో సొంత డబ్బులతో రోడ్డు వేయడం, మంచి నీటి సౌకర్యం కల్పించడం  చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారుల ట్రీట్ మెంట్ కోసం సాయం చేశారు SI రమేష్.

 

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

వామ్మో.. పాఠశాలకు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు!

మానుకోట టూ ఎర్రకోటకు.. మోడీతో మాట్లాడేది ఈ మహిళనే..

Latest Updates