హీరోలా ఓ వ్యక్తిని రక్షించిన ఎస్సై..

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరులో ఆసక్తికర సంఘటన జరిగింది. ఎస్సై ఓ వ్యక్తిని హీరోలా కాపాడాడు. స్థానిక పెద్దేరు జలాశయంలో ఓ మృతదేహం ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో మాడుగుల ఎస్సై రామారావు తన సిబ్బందితో ఆ జలాశయం వద్దకు వెళ్లారు. మృతదేహాన్ని వెలికి తీయించడానికి ఓ ఈతగాడిని అక్కడికి రప్పించారు. అయితే నీళ్లలోకి దిగిన ఆ ఈతగాడు కాసేపటికి మునిగిపోతూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అది గమనించిన ఎస్సై రామారావు వెంటనే యూనిఫాం విప్పేసి నీళ్లలోకి దూకి ఆ ఈతగాడిని ప్రాణాలతో బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ఎస్సై రామారావు హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటు పోలీసులు, అటు ప్రజలు ఎస్సై రామారావు చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆయనను అభినందించారు.

Latest Updates