3 రోజుల్లో ఆస్ట్రేలియా ప్రయాణం..ఇంతలోనే ఎస్సై కొడుకు సూసైడ్

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం ఆంధ్రకేసరి నగర్ లో సాయి తరుణ్ అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  10 రోజుల క్రితం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చిన తరుణ్.. మరో మూడు రోజుల్లో మళ్లీ ఆస్ట్రేలియా కి వెళ్లడానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్ తండ్రి శంకరయ్య హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. తరుణ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Latest Updates