కార్లు పెద్దగా అమ్ముడు పోవడం లేదు

ఆటో సేల్స్ జూన్‌ నెలలో 12.3 శాతం తగ్గి 19,97,952 యూనిట్లుగా రికార్డయ్యాయి. ప్రతి సెగ్మెంట్ లోనూ సేల్స్‌ డబుల్ డిజిట్ లో తగ్గిపోయినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్(సియామ్ ) డేటా వెల్లడించింది. ఫైనాన్సి యల్ సిస్టమ్‌లో తగినంత లిక్విడిటీ దొరకకపోవడంతో ఆటో కంపెనీలకు ఈ పరిస్థితి ఎదురైం దని సియామ్ తెలిపింది. ప్యాసెంజర్ వెహికిల్(పీవీ) అమ్మకాలను తీసుకుంటే, ఇవి జూన్ నెలలో 17.54 శాతం తగ్గి 2,25,732 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఈ అమ్మకాలు 2,73,748 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ కారు అమ్మకాలు ఏకంగా 24.97 శాతం తగ్గి 1,39,628 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఈ విక్రయాలు కూడా 2018 జూన్  నెలలో 1,83,885 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ డేటా బుధవారం వెల్లడించింది.

మోటార్ సైకిల్ సేల్స్ 9.57 శాతం తగ్గి 10,84,598 యూనిట్లుగా… టూవీలర్ సేల్స్ 11.69 శాతం తగ్గి 16,49,477 యూనిట్లుగా ఉన్నాయి. కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 12.27 శాతం తగ్గి 70,771 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు సియామ్ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మొత్తంగా పీవీ సేల్స్ 18.42 శాతం తగ్గి 7,12,620 యూనిట్లుగా నమోదైనట్టు సియామ్ డేటా తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఈ వెహికిల్స్ 8,73,490 యూనిట్లు అమ్ముడుపోయినట్టు పేర్కొంది. అన్ని కేటగిరీల్లో వెహికిల్‌ సేల్స్ కూడా ఏప్రిల్ నుం చి జూన్ మధ్య వరకున్న మూడు నెలల కాలంలో 12.35 శాతం తగ్గిపోయి 60,85,406 యూనిట్లకు చేరుకున్నట్టు తెలిపింది.

Latest Updates