జలుబు, దగ్గు  ఉంటే శ్రీవారి దర్శనానికి రావద్దు: టీటీడీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. వారు దర్శనానికి వస్తే భక్తుల రద్దీ కారణంగా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని… దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్‌)కు తరలించాలని నిర్ణయించింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు శానిటైజర్లు, మాస్కులతో రావాలని సూచించింది.

Latest Updates