ఏం అభివృద్ధి చేశారని.. ఏకగ్రీవాలు చేస్తున్నరు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం, పద్మనాభునిపల్లిలో ఏకగ్రీవ తీర్మానానికి తాము పూర్తి వ్యతిరేకమన్నారు గ్రామ యువకులు. అధికారపార్టీకి అనుకూలంగా పంచాయతీ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేయడంపై మండిపడుతున్నారు. ఆరేళ్ల నుంచి గ్రామంలో కనీస సౌకర్యాలు పట్టించుకోని.. మంత్రి హరీష్ రావు, రెండు రోజుల క్రితం వచ్చి హడావిడి చేశారని చెబుతున్నారు. తీర్మానాల పేరిట గ్రామాల్లో తిరుగుతూ అందర్నీ బెదిరిస్తూ బూటకపు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు యువకులు. తమ హక్కులను కాలరాస్తున్న అధికార  పార్టీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలిపారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేశారని.. ఏకగ్రీవాలు చేస్తున్నారని ప్రశ్నించారు యువకులు.

Latest Updates