వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 0.18శాతం మందిలో మాత్రమే దుష్ప్రభావాలు

వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో 0.18శాతం మందిలో మాత్రమే దుష్ప్రభావాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 0.002శాతం మంది మాత్రమే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని వివరించింది. ప్రపంచంతో పోలిస్తే భారత్ లోనే ఇంత తక్కువ స్థాయిలో రియాక్షన్స్ ఉన్నాయన్నారు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. రెండింటిలో ఒక వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్ మోడ్ లోనే ఎమర్జెన్సీ యూసేజ్ కు పర్మిషన్ ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ సేఫ్ అని డేటా చేపిస్తోందన్నారు వ్యాక్సినేషన్ కమిటీ చైర్మన్ VK పాల్. వ్యాక్సిన్ పట్ల ఆందోళన వీడాలన్నారు.

 

Latest Updates