పర్మిషన్ లేని ప్రైవేటు ఆస్పత్రులు సీజ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న మూడు ప్రైవేట్ ఆస్పత్రులను శనివారం మెడికల్ ఆఫీసర్లు సీజ్‌‌ చేశారు. శ్రీ సంజీవని, సాయి పల్లవి, శ్రీ సత్య సాయి తదితర ప్రైవేటు ఆస్పత్రులు ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్‌‌కు ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌‌వో అంబరీశ్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ల టీం ఆయా హాస్పిటల్లలో తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఎలాంటి పర్మిషన్ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీజ్ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాస్, రామకృష్ణ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates