అమెరికాలో సిక్కు కుటుంబం హత్య

అమెరికాలో దారుణం జరిగింది. ఓ సిక్కు కుటుంబం హత్యకు గురైంది. సిన్‌సిన్నాటిలో సిక్కు కుటుంబాన్ని దుండగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Latest Updates