జియోలో మరో రూ.4.5 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన సిల్వర్‌‌ లేక్

న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిల్వర్ లేక్ అనే కంపెనీ గత నెలలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జియోలో మరింత పెట్టుబడులు పెట్టడడానికి సిల్వర్ లేక్ ముందుకొచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.4,546 కోట్లను సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో జియోలో 2.08 శాతం స్టాక్స్‌ను సొంతం చేసుకొంది. జియోలో మొత్తంగా రూ.10,202.55 కోట్లను సిల్వర్‌‌లేక్ ఇన్వెస్ట్ చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘మా పరిధిని విస్తరించడం కోసం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచడానికి మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం. అలాగే మా కో-ఇన్వెస్టర్స్‌కు దీంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పిస్తున్నాం. తక్కువ ధరలో హై క్వాలిటీ డిజిటల్ సర్వీసులు అందించాలన్న జియో మిషన్‌లో మద్దతుగా నిలుస్తాం’ అని సిల్వర్ లేక్ కో-సీఈవో, మేనేజింగ్ పార్ట్‌నర్ ఎగోన్ డర్బన్ తెలిపారు.

జియో ప్లాట్‌ఫామ్స్‌లో మే 4న రూ.5,655 కోట్లను సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో 1.15 శాతం స్టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా సిల్వర్ లేక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో జియో సేకరించిన పెట్టుబడుల మొత్తం రూ.92,202 కోట్లుగా చెప్పొచ్చు. గత ఆరు వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతోపాటు గ్రోత్ ఇన్వెస్టర్స్‌ భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేశాయి. ఆ జాబితాలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా ఉన్నాయి.

Latest Updates