ఆ సిల్వర్..గోల్డ్ అ‌యింది

న్యూఢిల్లీ: జకర్తా ఏషియన్ ‌‌గేమ్స్‌‌లో ఇండియా 4×400 మిక్స్‌‌డ్ రిలే టీమ్ ‌‌నెగ్గిన సిల్వర్ ‌‌‌‌మెడల్‌‌.. గోల్డ్‌‌గా అప్‌‌గ్రేడ్ అయింది. ఆ ఈవెంట్‌లో గోల్డ్ ‌‌నెగ్గిన బహ్రెయిన్ టీమ్ ‌లో ఒక అథ్లెట్‌పై డోపింగ్ బ్యాన్ పడింది. దాంతో, బహ్రెయిన్‌‌ను డిస్ ‌‌క్వాలిఫై చేసిన ఆర్గ‌ నైజర్స్ ఇండియాకు గోల్డ్ కేటాయించారు. అలాగే, మహిళల 400 మీటర్ల హార్డిల్ర్డి స్‌‌లో నాలుగో ప్లేస్ సాధించిన అను రాఘవన్‌‌కు బ్రాంజ్ లభించింది. 2018లో జరిగిన ఏషియాడ్‌‌లో బహ్రెయిన్ 4×400 టీమ్‌‌.. 3:11:89 టైమింగ్‌‌తో టాప్ ‌‌ప్లేస్ సాధించింది. మొహమ్మద్‌ అనాస్‌‌, ఎమ్మార్ ‌‌‌‌పూవమ్మ, హిమదాస్‌‌, అరోకియా రాజీవ్‌‌తో కూడిన ఇండియా 3:15:89 టైమింగ్‌‌తో సెకండ్ ప్లేస్‌‌ లో నిలిచింది. 400 మీ. హార్డిల్ర్డి స్‌‌లో అను రాఘవన్ 56.92 సెకండ్లతో ఫోర్త్ ప్లేస్‌‌ సాధించింది.

అయితే, ఈ ఈవెంట్‌లో గోల్డ్ నెగ్గడంతో పాటు మిక్స్‌‌డ్ ‌‌రిలేలో పోటీపడ్డ బహ్రెయిన్ అథ్లెట్ కెమి అడెకొయా డోప్ టెస్టులో ఫెయిలవడంతో అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీయూనిట్ (ఏఐయూ) ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించింది. దాంతో, బహ్రెయిన్ నెగ్గిన గోల్డ్‌‌ను ఇండియాకు కేటాయించడంతో పాటు అనుకు బ్రాంజ్ ఇచ్చారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ‌‌ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్ అదిల్ సుమరివాలా గురువారం ప్రకటించారు. దాంతో, ఏషియన్‌‌గేమ్స్‌‌లో ఇండియా మెడల్స్‌ సంఖ్య 20కి చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates