రూ.2వేలు పెరిగిన వెండి ధర

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో బులియన్‌ మార్కెట్లో ఇవాళ(మంగళవారం) వెండి ధర దూసుకెళ్లింది. మంగళవారం ఒక్క రోజే రూ. 2000 పెరిగి గరిష్ఠాన్ని తాకింది. కేజీ వెండి ధర రూ. 45,000కు చేరినట్లు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ తెలిపింది. అయితే బంగారం ధర మాత్రం ఇవాళ స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 38,370గా ఉంది.

Latest Updates