బైల్స్..అదిరిపోయే విన్యాసాలు

స్టట్‌‌‌‌‌‌‌‌గార్ట్‌‌‌‌‌‌‌‌: ఆటలో అత్యున్నత శిఖరాలకు చెరేవారు కొందరు. ఆ ఆటకే వన్నె తెచ్చేవారు మరికొందరు. అమెరికా జిమ్నాస్టిక్స్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ సిమోన్‌‌‌‌‌‌‌‌ బైల్స్‌‌‌‌‌‌‌‌ రెండో కోవకే చెందుతుంది. 22 ఏళ్లకే ప్రపంచ జిమ్నాస్టిక్స్‌‌‌‌‌‌‌‌ క్వీన్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్న బైల్స్‌‌‌‌‌‌‌‌.. ఎన్నో మెడల్స్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకుంది. గుండె గుబేల్‌‌‌‌‌‌‌‌మనిపించే విన్యాసాలు చేసే ఈ అమ్మాయి వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టిక్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో పోటీపడ్డ మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలను తన పేరిట లిఖించుకుంది. ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో బైల్స్‌‌‌‌‌‌‌‌.. ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ స్కిల్‌‌‌‌‌‌‌‌ను పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దీనికి ‘బైల్స్‌‌‌‌‌‌‌‌ 2’అని పేరు పెట్టారు. ఆపై, బీమ్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌-ట్విస్టింగ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ టక్‌‌‌‌‌‌‌‌ డిస్మౌంట్‌‌‌‌‌‌‌‌ను పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేసింది. జిమ్నాస్టిక్స్‌‌‌‌‌‌‌‌లో మొట్టమొదటగా చేసిన ఈ విన్యాసాన్ని ఇకపై ‘ది బైల్స్‌‌‌‌‌‌‌‌’అని పిలవనున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా సిమోన్‌‌‌‌‌‌‌‌ పేరిట ఉన్న స్కిల్స్‌‌‌‌‌‌‌‌ నాలుగుకు పెరిగాయి.

ఇండియా జిమ్నాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు నిరాశ

ఈ టోర్నీలో ఇండియా మహిళలు నిరాశ పరిచారు. వ్యక్తిగత ఈవెంట్లలో హైదరాబాదీ అరుణా రెడ్డి సహా ఒక్కరు కూడా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై కాలేకపోయారు. వాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రణతి నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటెమ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 14.200 స్కోరు చేసినప్పటికీ  రెండో ప్రయత్నంలో న్యూట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొన్న ఆమె ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 27వ పేస్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈవెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరుణ రెడ్డి 8.925 స్కోరుతో ఇండియన్లలో చివరగా193వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది. బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ప్రణతి దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10.866), అరుణా రెడ్డి (10.200), ప్రణతి నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9.933) వరుసగా 138, 164, 174 ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో నిలిచారు. ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరుణ  పోటీని పూర్తి చేయలేకపోయింది.

Latest Updates