మాస్క్ తో… అందంగా మేకప్

అన్​లాక్ 4.0లో మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. దాదాపు ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. మరి ఆఫీసంటే బేసిక్ మేకప్ లేకపోతే ఎలా? అలాగే కొందరు కరోనా కాలంలోనూ శుభకార్యా ల విషయంలో వెనక్కి తగ్గట్లేదు. వేడుకల్లో మేకప్ కి ఉన్న డిమాం డ్ ఏంటో అందరికీ తెలిసిందే. కానీ, ఎంత అందంగా మేకప్ చేసుకున్నా మాస్క్​ పెట్టక తప్పదు. అందుకే ఈ వారం మాస్క్​ ఉన్నా అందంగా ఎలా మేకప్ చేసుకోవాలో చూద్దాం.

సహజ అందానికి కాస్త మేకప్ టచ్ ఇవ్వకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది చాలామందికి. మరీ ముఖ్యంగా, లిప్ స్టిక్ లేకుండా బయటికెళ్లడానికి అసలు ఇష్టపడరు అమ్మాయిలు. కానీ, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో గుమ్మం దాటి అడుగు బయట పెట్టాలంటే ముఖానికి మాస్క్​ తప్పనిసరి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. చీక్స్​కి ఎంత గ్రాండ్ మేకప్ వేసుకున్నా మాస్క్​ కవర్ చేస్తుంది. ఇలాంటప్పుడు మేకప్ కి నో చెప్పాల్సిందేనా అంటే అవసరం లేదు. కాస్త క్రియేటివ్ గా మేకప్ చేసుకుంటే చాలు కరోనా కాలంలోనూ ట్రెండీ లుక్స్​తో అదరగొట్టొచ్చు. అదెలాగంటే…

ఐ– మేకప్ పై దృష్టి పెట్టాలి

ఎవరి ముఖంలోనైనా చూడగానే ఆకట్టు కునేవి కళ్లే. అందుకే మిగిలిన అలంకరణ సంగతి ఎలా ఉన్నా.. కళ్లని మాత్రం గ్రాండ్ గా అలంకరిం చుకోవాలి. ఐ–మేకప్ వేసుకునే ముం దు కళ్లపై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీంతో కళ్లు మరింత అందంగా కనబడతాయి.తర్వాత కళ్ల చుట్టూ న్యూడ్‌‌ కలర్‌‌ బేస్‌ రాసి, వేసుకున్న దుస్తుల రంగును బట్టి కంటి పైభాగంలో రెండుమూడు షేడ్స్‌ రెప్పలకు వాడాలి. ఒక వేళ గ్రాండ్ అకేషన్ అయితే బోల్డ్ ఐ –మేకప్ బాగుంటుం ది. కలర్ ఫుల్ నియాన్, గ్లిటర్ ఐ–లైనర్స్​ అకేషన్స్​కి బాగుంటాయి. ఒకవేళ నార్మల్ మేకప్ లుక్స్​ కావాలనుకుం టే కను రెప్పలకి మస్కారా వేసేటప్పుడు రెప్పలు మొదట్నుంచి చివరి వరకు వేయాలి. అది ఆరక ముం దే ఐలాష్ కర్లర్ ని ఉపయోగించి వంపు తిప్పాలి. మీ వయసు, రంగుని బట్టి నలుపు, బ్రౌన్ , గ్రే రంగుల్లో ఉండే ఐ–లైనర్స్​ ఎంచుకోవాలి. అలాగే ఐ–బ్రో కోసం మ్యాట్ కలర్స్​ని ఉపయోగించడం వల్ల కనుబొమ్మలకు సహజమైన లుక్ వస్తుంది. కావాలనుకుం టే ఫాల్స్​ ల్యాషెస్​ పెట్టు కోవచ్చు.

ప్రొడక్స్ట్ ఎంచుకునే ముందు

ఈ టైంలో లిక్వి డ్ మేకప్ ప్రొడక్స్ట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. మాస్క్​ వల్ల చెమట పట్టడం లాంటి సమస్యలు వస్తాయి. దాంతో లిక్వి డ్ మేకప్ క్షణాల్లో కరిగిపోతుంది. పైగా మాస్క్​ కూడా పాడవుతుంది. అందుకే ఈ టైంలో పౌడర్ బేస్డ్ మేకప్ ప్రొడక్స్ట్ వాడాలి. అలాగే మేకప్ వేసుకునే ముం దు నాణ్యమైన క్లెన్సర్ లేదా పచ్చి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రైమర్ రాసి కాంపాక్ట్ పౌడర్ లేదా లూజ్ పౌడర్ ని ముఖానికి అద్దాలి. మాస్క్​ పెట్టు కునేటప్పుడు ఫౌండేషన్ , బీబీ క్రీమ్స్​కి దూరంగా ఉండాలి.

అవే ఎంచుకోవాలి

మాస్క్​ వల్ల పెదా లకి లిప్ స్టి క్ వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ, కొందరికి లిప్ స్టి క్ లేకపోతే మేకప్ పూర్తయిన ఫీలింగ్ రాదు. అలాగని హెవీ లిప్ స్టి క్ వేసుకుంటే అదంతా మాస్క్​కే అంటుకుంటుం ది. అలా కాకూడదంటే మ్యాటీ లేదా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్ స్టిక్స్​ ఎంచుకోవాలి. వాటివల్ల ఎన్ని గంటలైనా లిప్ స్టి క్ తాజాగా ఉంటుంది. అలాగే క్రీమీ,బుల్లెట్ మ్యాటీ లిప్ స్టి క్స్​కి బదులు లిక్విడ్ బేస్ట్ ట్రాన్స్​ఫర్. ప్రూఫ్ లిప్ స్టిక్ ఎంచుకోవాలి. ఇవి 12 నుంచి 13 గంటల పాటు చెదరకుండా ఉంటాయి. దానివల్ల ఇన్ డోర్ లో మాస్క్​ తీసినా లిప్ స్టిక్ చెక్కు చెదరదు.

మేకప్ కి ముందు

మాస్క్​ వల్ల చర్మ రంధ్రాల్లోంచి చెమట, జిడ్డు ఎక్కువగా కారుతుంటుంది. అలాంటప్పుడు మేకప్ వేసుకున్నా కొన్ని గంటల్లోనే స్కిన్ ఆయిలీగా మారుతుంది. అలాకాకుండా ఫేస్​లో ఫ్రెష్ లుక్ ఉండాలంటే మేకప్ కి ముందు ఐస్​ క్యూబ్స్​తో ముఖాన్ని శుభ్రం చేయాలి. దానివల్ల చర్మం తాజాగా ఉంటుంది. అలాగే మేకప్ ముం దు తప్పనిసరిగా సన్ స్ర్కీన్ లోషన్ రాయాలి.

 

Latest Updates