మళ్లీ బద్దలైన సినాబాంగ్ అగ్ని పర్వతం

జకర్తా: ఇండోనేషియాలోని సుమాత్రా దీవుల్లోని సినాబాంగ్ అగ్ని పర్వతం సోమవారం మరోసారి బద్దలైంది. అందులోంచి బూడిద, పొగ దాదాపు 500 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతోంది. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను బూడిద కమ్మేసింది. ఈ ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల వరకు బూడిద, పొగ ఆవహించటంతో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 400 ఏళ్ల తర్వాత సినాబాంగ్ అగ్నిపర్వతం 2010లో యాక్టివ్ గా మారింది. 2013 బద్దలైంది. అప్పటి నుంచి పలుమార్లు లావా, పొగ, బూడిద బయటకు వస్తోంది.

Latest Updates