చెన్నైలో సింధు బ్యాడ్మింటన్​ అకాడమీ

చెన్నై: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు పేరిట చెన్నైలో ఓ బ్యాడ్మింటన్​అకాడమీ ఏర్పాటు కానుంది.  హార్ట్‌‌ఫుల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీ నిర్మాణ పనులకు సింధు బుధవారం పునాది రాయి వేసి ప్రారంభించింది.  కొలప్పాక్కం స్కూల్​లో నిర్మించే ఈ సెంటర్‌‌ రెండేళ్ల లోపు పూర్తయ్యేలా ప్లాన్​ చేస్తున్నారు.

ఎనిమిది కోర్ట్​, వెయ్యి మంది సిట్టింగ్​ కెపాసిటీ, జిమ్, ఫిజియో, మెడిటేషన్ తోపాటు యోగా సెంటర్లను అకాడమీలో ఏర్పాటు చేస్తున్నారు. అకాడమీకి తన పేరు పెట్టడం పట్ల సింధు ఆనందం వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్​ టోర్నమెంట్లు ఆడే స్థాయికి ప్లేయర్స్​ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అకాడమీ పని చేస్తుందని తెలిపింది.

షెడ్యూల్‌‌ ఇదే: అమ్మాయిల టీ20 వరల్డ్‌ కప్‌

Latest Updates