ఫైనల్‌ చేరిన పీవీ సింధు

sindhu-defeats-chinas-chen-yufei-reach-finals

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌):  వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌ లో చైనాకు చెందిన యూఫీచెన్‌ ను 21-7, 21-14 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో మూడో సారి ఫైనల్‌ కు చేరుకున్న సింధు.. పసిడి పోరుకు బాటలు వేసుకుని తనపై అంచనాలు నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ ను 39 నిమిసాల్లోనే ఫినిష్ చేసి సత్తా చాటింది.

శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ లో సింధు 21–14, 21–6తో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో రచనాక్‌ ఇంతానాన్‌ తో కానీ.. ఒకుహారాతో కానీ సింధు తలపడనుంది. సెమీస్ లో ఈజీగా రాణిస్తున్న సింధు.. మరి ఈ సారైనా ఫైనల్ ఫోబియా నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Latest Updates