సింధు వర్సెస్ సైనా

స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ప్రధాన ఆకర్షణగా ప్రతిష్టాత్మక నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో గతేడాది పోటీపడిన సైనా, సింధు పోటీపడ్డారు. ఆ మ్యాచ్ లో సింధుపై సైనా పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఈసారిసైనాకు ఎలాగైనా జవాబు చెప్పాలని సింధు బరిలోకి దిగుతోంది. గత సీజన్ చివరి టోర్నీవరల్డ్ టూర్ ఫైనల్స్ లో స్వర్ణ పతకం గెలిచాక విశ్రాంతి తీసుకుని ఫుల్ ఫిట్ గా ఈ టోర్నీకి సిద్ధమైంది. అంతుముందు ఆరు టోర్నీలలో ఫైనల్ కు చేరి సత్తాచాటిన సంగతి తెలిసిందే. మరోవైపు గతేడాది నాలుగు టోర్నీలలో తుదిపోరుకు అర్హత సాధించిన సైనా కామన్వెల్త్ టోర్నీలో బంగారు పతకం సా ధించింది. ఇటీవల జరిగిన ఇండోనేసియా మా స్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచి చక్కని ఫామ్ లో ఉంది. వీరిద్దరి మధ్య గతేడాది కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్ జరుగగా అందులో సైనా విజేతగా నిలిచింది. ఈక్రమంలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న సైనా తన జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ఇక పురుషుల సింగిల్స్ లో టాప్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు.

Latest Updates