కరోనాతో పోరాడే 5 యాంటీబాడీస్‌ను కనుగొన్న సింగపూర్

వెల్లడించిన డీఆర్‌‌డీవో

సింగపూర్‌‌: కరోనాతో పోరాడే 5 రకాల యాంటీబాడీలను సింగపూర్ సైంటిస్ట్‌లు కనుగొన్నారని మన దేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌‌డీవో) బుధవారం వెల్లడించింది. వైరస్‌తో పోరాడి మార్చి నెల నుంచి కోలుకున్న పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్‌ నుంచి వేలాదిగా ‘బి’ సెల్స్‌ను సైంటిస్టులు కలెక్ట్ చేశారు. లీడ్ యాంటీబాడీ, ఏఓడీ01కు అవసరమైన హ్యూమన్ ట్రయల్స్‌ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ (డీఎస్‌వో) చెప్పింది. నేషనల్ సెంటర్‌‌ ఫర్‌‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌, సింగపూర్‌‌ జనరల్‌ హాస్పిటల్‌ సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ నుంచి నెల రోజుల్లో రెండు యాంటీబాడీస్‌ను, రెండు నెలల తర్వాత థర్డ్‌ యాంటాబాడీని సైంటిస్ట్‌లు డివైడ్‌ చేశారు. వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయడంలో యాంటీబాడీస్ సమర్ధవంతంగా పనిచేస్తాయని డీఎస్‌వో చెప్పింది. రీసెర్చ్‌ పూర్తయిందని, ప్రీక్లినికల్‌ ఫేజ్ స్టడీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నామని, లీడ్‌ యాంటీబాడీ ప్రొడక్షన్‌కు ప్రిపేర్‌‌ అవుతున్నామని ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, లాబొరేటరీ డైరెక్టర్‌‌ కాన్‌రాడ్ చాన్‌ అన్నారు. క్లినికల్ ట్రయల్ సక్సెస్‌ అయితే, వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న పేషెంట్లకు యాంటీబాడీస్‌ సాయంతో వైరస్‌ వ్యాప్తి ఊపిరితిత్తులకు చేరకుండా అడ్డుకోవచ్చని ఆయన చెప్పారు.

Singapore scientists discover 5 antibodies that can combat Covid-19

Latest Updates